| కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా |
కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మలినాలు తొలగించే ప్రక్రియ లో విట్లో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్ లు రావొచ్చు. అందకే వీటిని తరుచు డిటాక్స్ చేయం మంచిది. సహజంగా కిడ్నీ లను డిటాక్స్ చేయడం ఎలాగో చూద్దాం. ఫ్రెష్ పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండండి. గ్రేప్స్,ఆరెంజేస్, బననా, కివి, అప్రికాట్ లాంటివి పొటాషియం కు మంచి సోర్స్. పాలు, పెరుగు లలో కూడా పుష్కంగానే ఉంటాయి. ముఖ్యంగా, వివివ్డ రకాల బెర్రీస్, ఎందుకంటే వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్ గ మారి కిడ్నీ లను సమర్దవంతంగా శుబ్రం చేస్తుంది. కిడ్నీ లను సులభంగా శుబ్ర పరచగల ఒకే ఒక సాదనం మంచి నీళ్ళు. దాదాపు గ 8 నుండి 10 గ్లాస్ ల వరకు రోజు తాగండి. ఇతరత్రా సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు. నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మీ మూత్రం క్లియర్ గ, ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటె మీరు సరిపడ నీరు తాగుతున్నరన్నమాట, లేకపోతే మీరు ఇంకా నీళ్ళు తాగాలి అన్నట్టు.
| Date :Monday, January 8, 2018 1/9/2018 2:24:32 AM
|
|
|
|
|
|
|