| దంతాలపై ఏర్పడిన పసుపు రంగునను తొలగించే గృహ నివారణలు |
పొగాకు నమలటం, వర్ణ ద్రవ్యాలు అధికంగా గల పండ్లు, వైన్ వంటి వాటి వలన దంతాల రంగు మారుతుంది. ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. 1. ఫ్లోసింగ్ మరియు రోజు రెండు సార్లు దంతాలకు బ్రెష్ చేయటం మరియు ఆహారం తిన్న తరువాత నీటితో పుకిలించి ఉంచటం వలన పూర్తి నోరు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది. ఇలా చేయటం వలన దంతాలపై ఏర్పడే మారకలు కుడా తొలగిపోతాయి. 2. రంగు మారిన దంతాల కోసం మంచి ఔషదంగా బేకింగ్ సోడాను పేర్కొనవచ్చు. రెండు చెంచాల బేకింగ్ సోడాను, నీటిలో కలిపి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని దంతాలకు వాడటం వలన పుసుపు లేదా గోధుమ రంగులోకి మారిన దంతాలు తెల్లగా మారతాయి. 3. యాంటీ బాక్టీరియల్, హీలింగ్ గుణాలను కలిగి ఉండే నిమ్మ దంతాలపై ఏర్పడిన మరకలను తొలగిస్తుంది. కొద్దిగా ఉప్పును నిమ్మరసంలో కలపండి. ఈ మిశ్రమాన్ని దంతాలకు అద్దండి. తరువాత టూత్ పేస్ట్ తో మీ దంతాలను మరియు చిగుళ్ళపై రాయండి. కొన్ని నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగివేయటం వలన పళ్ళ పై ఉండే పచ్చటి మరకలు తొలగిపోయి, పళ్ళు తెల్లగా మారతాయి. 4. దంతాలను తెల్లగా మార్చే ఏజెంట్ గా ఉప్పును పేర్కొనవచ్చు. ఉప్పు, దంతాలు కోల్పోయిన మినరల్ లను తిరిగి అందించి, తెలుపుదనాన్ని కూడా తిరిగి అందిస్తుంది. ఈ గుణాలను కలిగి ఉన్నందు వల్లనే ఉప్పును టూత్ పేస్ట్ తయారీలో వాడుతున్నారు. ఉప్పును బేకింగ్ సోడా లేదా చార్కోల్ తో కలిపి దంతాలపై రాయటం వలన పళ్ళు తెల్లగా మెరుస్తాయి. 5. దంతాలను తెల్లగా మార్చే గుణాలను కలబంద కలిగి ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ లు వ్యతిరేఖంగా పని చేయటమేకాకుండా, దంతాలను శుభ్రపరుస్తుంది. దంత మూలం మరియు కావిటీల పైన సమర్థవంతంగా పని చేస్తుంది. కలబంద, వెజిటేబుల్ ఆయిల్ తో కలిపి పేస్ట్ లా చేసి, దంతాలకు అప్లై చేసి మార్పును గమనించండి.
| Date :Friday, December 21, 2018 12/21/2018 7:18:08 AM
|
|
|
|
|
|
|