| గ్రీన్ టీ మీ బరువును తగ్గించడానికి ఏ విధంగా సహకరిస్తుందో మీకు తెలుసా! |
బరువు తగ్గించదంలో గ్రీన్ టీ పాత్రను గురించి తెలిపే అనేక వ్యాసాలను మీరు ఇప్పటికే చాలా చదివి ఉంటారు . కానీ ఏ గ్రీన్ టీ బరువును తగ్గించడంలో ఉత్తమమైనదో మీకు తెలుసా? ఈ వ్యాసం రాయడానికి ముఖ్య కారణం అదే! క్యాన్సర్ నివారణ మరియు చికిత్స, హృద్రోగ సమస్యలు, రుమటాయిడ్ ఆర్ధ్రైటిస్, ఇన్ఫెక్షన్లు, దంత సమస్యలు మరియు అధిక కొలెస్ట్రాల్ వంటి రోగాల పరిష్కారానికి, గ్రీన్ టీని మీ దైనందిన ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.గ్రీన్ టీలో ఎన్నో వ్యాధులతో పోరాడే ఎపిగాల్లోకెటచిన్-3 గల్లేట్ (EGCG), అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీ రుచికి చేదుగా, మనను ఉత్తేజపరిచే గుణాలతో ఉంటుంది. గ్రీన్ టీలో కేటచిన్, ఎపికేటచిన్, ఎపికేటచిన్ గాలెట్ (ECG), ఎపిగాల్లోకెటచిన్-3 గల్లేట్ (EGCG) అనే కేటచిన్ పోలిఫెనోల్స్ యొక్క రసాయన సమూహం మరియు అనేక ఇతర ప్రోఏంథోసయినడిన్స్ ఉంటాయి.ఈ రకమైన తేయాకులను కాచినపుడు, ఆకుపచ్చ రంగులోకి మారతాయి. లేత చిగుర్ల నుండి ఈ ఆకులను సేకరించడం మూలాన, ఆరోగ్యానికి మేలు చేసే ఈ రకం టీకి అత్యుత్తమ రుచి మరియు సువాసన ఉంటాయి. ఇంతేకాక, లేత ఆకులలో టానిన్లు మరియు కెఫిన్లు తక్కువగా ఉండటం మూలాన, ఈ టీ లో చేదుతనం తక్కువగా ఉంటుంది.
| Date :Monday, June 11, 2018 6/12/2018 3:59:41 AM
|
|
|
|
|
|
|